తెలంగాణ రాష్ట్రంలోని నృత్యాలు —

తెలంగాణ నృత్యం 1) కోయనృత్యం(పెర్మి కోర్)

ఈ కోయ నృత్యన్ని తెలంగాణ రాష్ట్రంలోని ప్రధానంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని షెడ్యూల్ తెగల ప్రాంతాలలో వుండే కోయ తెగవారు ప్రదర్శిస్తారు.

ముఖ్యంగా ములుగు నియోజకవర్గంలో కోయ నృత్యం ఎక్కువగా కనిపిస్తుంది.

ముఖ్యంగా "సమ్మక్క సారలమ్మ జాతర" సమయం వులో మరియు వీరి యొక్క సంప్రదాయ ఆచారాల దేవుళ్ల కొలువులో మరియు పండుగలలో ఈ నృత్యమును అలరిస్థారు.

ఈ నృత్యంలో స్త్రీ, పురుషులు ఇద్దరు పాల్గొంటారు. ఈ నృత్యంలో సుమారు 10 నుండి 15 మంది పాల్గొంటారు.వీరిని" దొరల సటం"అని పిలుస్తారు.

ఈ కోయ నృత్యంలో పురుషులు ఎద్దు కొమ్ములను తల పై ధరించి,రంగు రంగుల దుస్తులను ధరిస్తారు.

కోయలు ఈ నృత్యంలో పెర్మకొర్ అటను ప్రదర్శిస్తారు.

అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చింతురు (ఈస్ట్ గోదావరి) ప్రాంతంలో కూడా పర్మికొర్ నృత్యాన్ని ప్రదర్శిస్తారు.

OH HEY, FOR BEST VIEWING, YOU'LL NEED TO TURN YOUR PHONE